: ఏపీ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా ఆహ్వానపత్రిక ఉంటుంది: మంత్రి నారాయణ
నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన కోసం ఆహ్వాన పత్రిక సిద్ధమవుతోందని మంత్రి నారాయణ తెలిపారు. మన చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా ఆహ్వానపత్రిక ఉంటుందని చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు, వివిధ దేశాల దౌత్యవేత్తలను ఆహ్వానిస్తామని వెల్లడించారు. గుంటూరు జిల్లా ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాన వేదిక ప్రాంతం వద్ద భూమి చదును పనులను ఈరోజు ప్రారంభించారు. శంకుస్థాపన పనులను మంత్రి నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ పరిశీలించారు.