: పంజాబ్ లో రైతు సంఘాల ఆందోళనకు రైళ్లు రద్దయ్యాయి


ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా పంజాబ్ రాష్ట్రంలో రైతు సంఘాలు చేస్తున్న ఆందోళనకు ఏకంగా రైళ్లు రద్దయ్యాయి. పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ లపై బైఠాయించి రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళన చేస్తుండటంతో ఇంతవరకు 7 రైళ్లను రద్దు చేశారు. మరో 12 రైళ్లను అధికారులు దారి మళ్లించారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, గిట్టుబాటు ధర కల్పించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపాయి. రైతుల ఆందోళనలు నేడు, రేపు కొనసాగుతాయని రైతు సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News