: అమెరికా వలస ఉద్యోగుల్లో భారత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లే అత్యధికం


అమెరికాలో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లుగా విధులు నిర్వహిస్తున్న విదేశీ వాసుల్లో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ఎన్సీఎస్ఈఎస్ (నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టాటిస్టిక్స్) ఈ నివేదికను వెలువరించగా, 2003 నుంచి 2013 మధ్య వలస వచ్చిన వారి సంఖ్య 85 శాతం పెరిగిందని, ఆసియా నుంచి మొత్తం 26.90 లక్షల మంది యూఎస్ కు వలస రాగా, అందులో 9.50 లక్షల మంది భారతీయులున్నారని తెలిపింది. ఇదే పదేళ్ల వ్యవధిలో ఫిలిప్పీన్స్ వాసుల సంఖ్య 53 శాతం, హాంకాంగ్, చైనా నుంచి వలస వచ్చిన వారి సంఖ్య 34 శాతం పెరిగిందని వివరించింది. తాజా గణాంకాల ప్రకారం మొత్తం శాస్త్రవేత్తలు, ఇంజనీర్లలో 63 శాతం మంది అమెరికాలో పుట్టిన వారుండగా, 22 శాతం మంది శాశ్వత నివాసితులు, 15 శాతం మంది తాత్కాలిక వీసాలపై నివాసముంటున్న వారు ఉన్నారని వెల్లడించింది. 32 శాతం మంది వలస శాస్త్రవేత్తలు మాస్టర్స్ డిగ్రీ చేసివుండగా, 9 శాతం మంది డాక్టరేట్ చేసి ఈ రంగంలో స్థిరపడ్డారని ఎన్సీఎస్ఈఎస్ పేర్కొంది.

  • Loading...

More Telugu News