: రేపటి నుంచి ప్రారంభం కానున్న జగన్ దీక్ష


వైఎస్ ఆర్సీపీ అధినేత జగన్ దీక్ష రేపటి నుంచి గుంటూరు జిల్లా నల్లపాడు రోడ్డులో ప్రారంభంకానుంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్న జగన్ ఉదయం 10.30 గంటలకు తన దీక్ష ప్రారంభిస్తారు. దీక్షాస్థలి వద్ద అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. హైదరాబాద్ నుంచి ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా కనకదుర్గ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నల్లపాడుకు బయలుదేరి వెళతారు. దీక్షలో పాల్గొనేందుకు పలు జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు దీక్షా ప్రాంగణానికి తరలివెళ్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు కూడా దీక్షలో పాల్గొననున్నారు.

  • Loading...

More Telugu News