: రాజధాని శంకుస్థాపనకు బాబారాందేవ్ ను ఆహ్వానించాం: మంత్రి కామినేని


ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలని యోగా గురువు రాందేవ్ బాబాను ఆహ్వానించారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. రాందేవ్ బాబాతో కలిసి తిరుపతిలో యోగ ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీలో ఎయిమ్స్ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు. దీని ఏర్పాటు విషయంలో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు చెప్పారు. కాగా, అక్టోబరు 22వ తేదీన రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి భారత, సింగపూర్ ప్రధాన మంత్రులతో పాటు జపాన్ విదేశాంగ మంత్రి కూడా హాజరుకానున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News