: మూడేళ్ల లా కోర్స్ రద్దు చేయాలి: మద్రాసు హైకోర్టు సూచన


మూడేళ్ల లా కోర్సును రద్దు చేసి, ఐదేళ్ల కోర్సును యథావిధిగా కొనసాగించాలని మద్రాసు హైకోర్టు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సూచించింది. సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వృత్తి విద్యా కోర్సులైన మెడిసిన్, ఇంజనీరింగ్ కు నిర్వహిస్తున్న మాదిరిగా న్యాయ విద్యకు కూడా ఐదేళ్ల కోర్సునే కొనసాగించాలంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను నిపుణులతో నడిపించాలని, అందుకుగాను చేపట్టాల్సిన సమూల మార్పుల గురించి సూచించింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహణ బాధ్యతలను సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ స్థాయి వ్యక్తి ఆధ్వర్యంలో ఒక కమిటీ శాశ్వతంగా కానీ లేదా అడ్వకేట్స్ యాక్టులో సరైన సవరణలు చేసేవరకు గానీ కొనసాగించాలని పేర్కొంది. ఈ కమిటీలో అకాడమిక్ నిపుణులు, న్యాయమూర్తులు, సామాజిక కార్యకర్తలు, పదవీ విరమణ చేసిన అధికారులు, ఐఏఎస్ అధికారులు, వైద్యులు సభ్యులుగా ఉండాలని సూచించింది.

  • Loading...

More Telugu News