: జీహెచ్ఎంసీ పరిధిలో 6 లక్షల 30 వేల ఓట్లు తొలగించాం: భన్వర్ లాల్


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 6 లక్షల 30వేల ఓట్లు తొలగించినట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు. వాటిలో చనిపోయిన వారు, డూప్లికేట్ ఓటర్లు, తరలివెళ్లినవారు ఉన్నారన్నారు. అర్హత ఉన్న వారికి జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే జనవరి నుంచి 11న కొత్త ఓటర్ల జాబితా ప్రకటిస్తామని చెప్పారు. అటు డిసెంబర్ 31లోగా ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఇప్పటివరకు 19 లక్షల మంది ఓటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని భన్వర్ లాల్ తెలిపారు. ఓటర్లు తమ ఓటర్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కొత్త ఓటరు కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News