: పోలీసులమని చెప్పి 10 లక్షలు దోచేశారు


పోలీసులమని నమ్మించి ఓ వ్యక్తి నుంచి పది లక్షల రూపాయలను దోచుకెళ్లిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. నాచారం సమీపంలో పోలీసులమని చెప్పి కొందరు దుండగులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శామీర్ పేట అలియాబాద్ కు చెందిన ఓ వ్యక్తి నుంచి 10 లక్షల రూపాయలు దోచుకున్నారు. మోసపోయానని గుర్తించిన బాధితుడు నాచారం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మరో ఘటనలో శంషాబాద్ లో పోలీసులమని చెప్పి తనిఖీల పేరిట వసూళ్లకు పాల్పడుతున్న ఆరుగురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 63 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News