: భౌతికశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ పురస్కారం
భౌతికశాస్త్రంలో 2015 సంవత్సరానికిగానూ ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది. తకాకి కజిత (జపాన్), ఆర్థర్ బి.మెక్ డొనాల్డ్ (కెనడా) లకు ఈ పురస్కారం ప్రకటించారు. న్యూట్రినోలు ఎలా పనిచేస్తాయన్న అంశంపై చేసిన పరిశోధనకు గానూ రాయల్ స్వీడిష్ అకాడమీ వారు ఈ పురస్కారం ప్రకటించారు.