: అమరావతి శంకుస్థాపన ముహూర్తం సరైంది కాదు... ఓ సంస్కృత లెక్చరర్ వాదన


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఈ నెల 22న మధ్యాహ్నం 12.45 నిమిషాలకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ముహూర్తంపై వివాదం నెలకొంది. ప్రభుత్వం ఖరారు చేసిన ముహూర్తం సరైంది కాదని పీహెచ్.హెచ్ఈ పురుషోత్తం అనే సంస్కృత లెక్చరర్ వాదిస్తున్నారు. ఈ నెల 22న మకర లగ్నంలో 12.35 నుంచి 12.45 గంటల మధ్య చేస్తే రాజధాని నిర్మాణానికి, సీఎం చంద్రబాబుకు ఆటంకాలు ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు. ధనుర్ లగ్నంలో అదే రోజు 11.32 నిమిషాలకు కొంతమేలుగా ఉంటుందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News