: గాల్లో విమానం, పైలెట్ మరణం... ఇక చదవండి!


అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం... ఫీనిక్స్ నుంచి బోస్టన్ కు ఆదివారం రాత్రి 11:55 గంటలకు (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం దాదాపు 10:30) బయలుదేరింది. ప్రయాణించాల్సిన దూరం 2,648 కిలోమీటర్లు. విమానం ప్రయాణిస్తుండగా, ప్రధాన పైలెట్ కు తీవ్ర అస్వస్థత. అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయన వెంటనే మరణించాడు. గమ్యానికి ఇంకా వందల మైళ్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితుల్లో కో పైలట్ జాగ్రత్తగా వ్యవహరించి, విమానాన్ని దగ్గర్లో ఉన్న సిరాకస్ విమానాశ్రయంలో జాగ్రత్తగా దించి 147 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. పైలెట్ మరణించిన విషయాన్ని ప్రయాణికులకు తెలియకుండా చూశాడు. దీంతో వారిలో భయానక వాతావరణం, ఆందోళన తప్పినట్లయింది. విమానం దిగిన తరువాత అసలు విషయం తెలుసుకున్న ప్రయాణికులు కో -పైలెట్ చాకచక్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అన్నట్టు కో పైలెట్, సిరాకస్ విమానాశ్రయ అధికారులకు సైతం అసలు విషయం చెప్పకుండా, మెడికల్ ఎమర్జన్సీ ఉందని, వెంటనే దిగేందుకు అనుమతించాలని కోరాడట. కో పైలెట్ కు సైతం విమానాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించగల సామర్థ్యం ఉంటుందని అమెరికన్ ఎయిర్ లైన్స్ అధికారులు వెల్లడించారు. కాగా, అమెరికాలో ఎయిర్ లైన్స్ విమానాలను నడుపుతూ, ఇంతవరకు ఏడుగురు పైలెట్లు మరణించారు.

  • Loading...

More Telugu News