: వారణాసిలో ఆందోళనలు: కర్ఫ్యూ విధింపు


గత నెల 22వ తేదీన గణేశ్ విగ్రహాల నిమజ్జన సమయంలో పోలీసుల చర్యలను నిరసిస్తూ సోమవారం వారణాసిలో పలువురు ఆందోళనలకు దిగారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు తలెత్తిన కారణంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గణేశ్ నిమజ్జనం రోజున గంగానది వైపు వెళ్లిన వారిపై పోలీసులు లాఠీ చార్జి చేశారని ఆరోపిస్తూ ఈ ఆందోళన ర్యాలీ చేపట్టారు. ఆందోళనకారులు పలుచోట్ల వాహనాలను తగులబెట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు. దశాశ్వమేథ్, కొట్వాలి, చౌక్, లుక్సా తదితర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News