: ఒకేరోజు నాలుగు చోట్ల ప్రచారం చేయనున్న ప్రధాని మోదీ


బీహార్ లోని ప్రధాన ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబరు 8వ తేదీన ఒకే రోజు నాలుగు చోట్ల ప్రచార సభల్లో మోదీ ప్రసంగించనున్నారు. ముంగేర్, సమస్తిపూర్, బెగుసరాయ్, నావాడా ప్రాంతాల్లో ఆ రోజు ప్రచారం ఉంటుంది. ఆ రాత్రి పాట్నాలో బసచేసి మర్నాడు ససారం, మఖ్ ధూమ్ పూర్, ఆర్వాల్ లో ప్రచారం చేయనున్నారు. అక్టోబరు 10వ తేదీ నాటి మోదీ ప్రచార షెడ్యూల్ వివరాలు ఇంకా ప్రకటించలేదు. సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల ప్రచారం చేసి బీహార్ ప్రజల ఓట్లను బీజేపీకి పడేలా చేసేందుకు ప్రధాని మోదీ యత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News