: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే: సీతారాం ఏచూరి


ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్ చేస్తున్న వారి జాబితాలో మరో నేత చేరారు. ముస్లింలకు కచ్చితంగా ఆ మాత్రం రిజర్వేషన్లు ఉండాల్సిందే అని సీపీఎం కేంద్ర కమిటీ కార్యదర్శి సీతారాం ఏచూరి కోరారు. వీటిని సాధించేందుకు ఐక్య పోరాటం చేస్తామని చెప్పారు. హైదరాబాదులోని నాంపల్లిలో జరిగిన ముస్లిం సంఘాల సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రసంగిస్తూ పైవ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, దేశంలో ముస్లింలకు భద్రత కరవైందని ఏచూరి అన్నారు.

  • Loading...

More Telugu News