: కళాశాలలో బీఫ్ ఫెస్ట్ నిర్వహించారని ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సస్పెన్షన్


దేశవ్యాప్తంగా పశుమాంసంపై వివాదం రేగుతోంది. ఉత్తరప్రదేశ్ లో పశుమాంసం తిన్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని హత్య చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నిరసన తెలిపేందుకు కేరళలోని ఓ ప్రభుత్వ కళాశాలలో ఎస్ఎఫ్ఐకి చెందిన ఆరుగురు విద్యార్థులు బీఫ్ ఫెస్ట్ నిర్వహించారు. దీనిపై కళాశాల యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. కళాశాల నిబంధనలకు విరుద్ధంగా బీఫ్ పంపిణీ చేశారంటూ ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేసింది. కళాశాల వేడుకల్లో కూడా మాంసాహారం అనుమతించమని, అలాంటిది పశుమాసం పంపిణీ చేయడం శిక్షార్హమైన నేరమని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు.

  • Loading...

More Telugu News