: విపక్షాలు రాజకీయ డ్రామాలు చేస్తున్నాయి: జూపల్లి


శాసనసభలో రైతు సమస్యలపై తీవ్ర ఆందోళన చేసిన విపక్షాలు కావాలనే సభను అడ్డుకుంటున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. విపక్షాల డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎల్పీలో జూపల్లి మీడియాతో మాట్లాడారు. రైతులకు శాశ్వత ఉపశమనం చూపిస్తున్నామన్నారు. కానీ రైతుల గురించి కాంగ్రెస్, టీడీపీ ఎప్పుడూ ఆలోచించలేదని విమర్శించారు. జూరాల ప్రాజెక్ట్ నిర్మాణానికి కాంగ్రెస్, టీడీపీలకు 25 ఏళ్లు పట్టిందన్న జూపల్లి, వారి కంటే తామే బాధ్యతగా వ్యవహరిస్తున్నామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు లేని సంవత్సరం అంటూ లేదని ఆరోపించారు. రైతుల కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. అసలు సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. బీజేపీ బచాయించలేదనే కారణంతోనే నాగం 'బచావో' పెట్టుకున్నారని విమర్శించిన మంత్రి, బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు జరిగితే బచావో అని ఎందుకనలేదని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News