: వరుస డ్యూటీలతో అలసిపోయిన డ్రైవర్.. గంటలపాటు నిలిచిపోయిన గూడ్స్ రైలు


ఒక రైలు డ్రైవర్ కు అదే పనిగా డ్యూటీలు పడుతుండటంతో బాగా అలసిపోయాడు. ముఖ్యంగా నిద్ర సరిగ్గా లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. ఒకరోజు తాను డ్రైవర్ గా వెళ్లిన గూడ్స్ రైలును స్టేషన్ లోనే 17 గంటలపాటు నిలిపివేశాడు. దీంతో ఈ అంశం రైల్వే శాఖ పాలనా యంత్రాంగంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. ఉత్తరప్రదేశ్ లోని భదోహీ ప్రాంతానికి చెందిన రైలు డ్రైవర్ స్థానిక మోథ్ రైల్వేస్టేషన్ లో గూడ్స్ రైలుని 17 గంటలపాటు నిలిపి వేశాడు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించాల్సిన రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లు గంటల పాటు ఆలస్యంగా నడిచాయి. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించారు.

  • Loading...

More Telugu News