: చంద్రబాబు అడ్డుకున్నా, అధిగమించగలిగాం: సోమారపు
తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన విద్యుత్ ను ఇవ్వకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకున్నా... ఆ సమస్యను అధిగమించగలిగామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలలకే విద్యుత్ సమస్యను అధిగమించామని చెప్పారు. గ్రామాలకు 24 గంటల పాటు సింగిల్ ఫేజ్ విద్యుత్తును సరఫరా చేస్తున్నామని, పరిశ్రమలకు నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తున్నామని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, రైతులు ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ అంశంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగిన సందర్భంగా, ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.