: అభిరుచి గల నిర్మాతగా ఏడిద తనను తాను ఆవిష్కరించుకున్నారు: చిరంజీవి


హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు భౌతికకాయానికి సినీ నటుడు చిరంజీవి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గౌరవాన్ని ఇనుమడించేలా ఏడిద సినిమాలు తీశారని ఈ సందర్భంగా అన్నారు. నటుడు కావాలని చిత్ర పరిశ్రమకు వచ్చిన ఆయన... తరువాత కాలంలో తనను తాను అత్యున్నత అభిరుచి గల నిర్మాతగా ఆవిష్కరించుకున్నారని పేర్కొన్నారు. కమర్షియల్ సినిమాలకు లోబడకుండా కళాత్మక విలువలున్న సినిమాలనే నిర్మించారన్నారు. అటువంటి వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోవటం దురదృష్టకరమని చెప్పారు. ఏడిదగారి పూర్ణోదయ సంస్థ నిర్మించిన 'తాయారమ్మ.. బంగారయ్య'లో మొదటిసారి తాను గెస్ట్ రోల్ చేశానని చెప్పారు. తరువాత వారి సంస్థలోనే 'స్వయంకృషి', 'ఆపద్బాంధవుడు' చిత్రాల్లో నటించానని తెలిపారు. ఆ రెండు సినిమాలు తనకు తలమానికంగా నిలిచాయని, రెండూ తనకు అవార్డులు తెచ్చిపెట్టాయని చిరు గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News