: మోదీతో భేటీ అయిన జర్మనీ ఛాన్సెలర్
జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ భారత్ లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె నిన్న ఢిల్లీ చేరుకున్నారు. ఈ క్రమంలో, భారత ప్రధాని మోదీతో హైదరాబాద్ హౌస్ లో ఆమె భేటీ అయ్యారు. భద్రత, రక్షణ అంశాలతో పాటు, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై ఇరువురూ చర్చిస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత మెర్కెల్ భారత్ కు రావడం ఇదే ప్రథమం. మోదీతో భేటీకి ముందు... రాష్ట్రపతి భవన్ లో త్రివిధ దళాల నుంచి మెర్కెల్ గౌరవ వందనం అందుకున్నారు. ఏప్రిల్ నెలలో 'మేక్ ఇన్ ఇండియా' ప్రచారం కోసం మోదీ జర్మనీ వెళ్లారు. అప్పుడు కూడా మెర్కెల్, మోదీలు సమావేశమయ్యారు.