: విచారణకు హాజరుకండి: ఏపీ సీఐడీ చీఫ్ కు హైకోర్టు ఆదేశం
అగ్రిగోల్డ్ కేసు విచారణను హైకోర్టు ఈ మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా కేసు విచారణకు హాజరు కావాలంటూ ఏపీ సీఐడీ చీఫ్ ను ఆదేశించింది. అగ్రిగోల్డ్ ఆస్తులు, లావాదేవీల వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన నిందితులను అరెస్ట్ చేయకుండా ఎవరు అడ్డుపడుతున్నారంటూ సీఐడీని ప్రశ్నించింది. మరోవైపు కోర్టుకు సమర్పించిన ఆస్తుల వివరాలు కరెక్టేనంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని తెలిపింది. ఇందులో ఏవైనా తప్పులు ఉంటే, దానికి అగ్రిగోల్డ్ దే బాధ్యత అని స్పష్టం చేసింది.