: ఉన్నత విద్యామండలి వివాదంపై కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
ఏపీ ఉన్నత విద్యామండలి ఖాతాల వివాదంపై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఈ వివాదంపై నాలుగు వారాలలో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను నవంబర్ 30కి కోర్టు వాయిదా వేసింది. రాష్ట్ర విభజన తరువాత ఏపీ, తెలంగాణ విద్యా మండళ్ల పరిధి, వాటి ఖాతాల నిర్వహణపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.