: విపక్ష సభ్యులపై అసహనం వ్యక్తం చేసిన కేసీఆర్


తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రైతు రుణమాఫీపై విస్పష్టమైన ప్రకటన చేయాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, విపక్ష సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. బీఏసీలో నిర్ణయించిన విధంగా రెండు రోజులపాటు రైతు ఆత్మహత్యలపై సమగ్రంగా చర్చించామని... ఈ అంశంపై చర్చ కోసం ప్రశ్నోత్తరాలను సైతం పక్కన బెట్టామని అన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని సభాముఖంగా స్పష్టంగా చెప్పామని తెలిపారు. కానీ, ఏం చేస్తారో, ఎలా చేస్తారో ఇప్పుడే చెప్పాలని పట్టుబట్టడం సరైన పద్ధతి కాదని అసహనం వ్యక్తం చేశారు. ఏం చేయాలన్న దానిపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విపక్ష సభ్యులు ఈ విధంగా సభను అడ్డుకోవడం మంచిది కాదని అన్నారు.

  • Loading...

More Telugu News