: మీ సలహాలు మాకు అక్కర్లేదు: నవాజ్ షరీఫ్ కు మనోహర్ పారికర్ సమాధానం


సియాచిన్ లో మోహరించిన భారత సైన్యాన్ని తక్షణం ఉపసంహరించాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇచ్చిన సలహాకు భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గట్టిగా సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో తమకు ఎవరి సలహాలు అక్కర్లేదని ఆయన అన్నారు. ఇతరుల మాటలు తాను వినేది కూడా లేదన్నారు. పాకిస్థాన్, కాశ్మీర్ ప్రాంతాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం పెరుగుతున్న వార్తలపై వివరణ కోరగా, "పాకిస్థాన్ లో జరుగుతున్న ఉగ్రవాద చర్యలపై నేనేమీ వ్యాఖ్యానించబోను. అయితే, కాశ్మీర్ కు సంబంధించినంత వరకూ గత రెండు మూడేళ్లుగా పరిస్థితి మెరుగుపడింది" అన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా భారత రక్షణ రంగంలో 30 నుంచి 40 లక్షల మందికి ఉపాధి లభించనుందని ఆయన వివరించారు. ఎఎన్ఎస్ త్రికండ్ యుద్ధ నౌకను టర్కీ తీరానికి తరలించడంపై స్పందిస్తూ, ఇండియాతో స్నేహపూర్వకంగా ఉండే ఎన్నో దేశాలతో కలసి సంయుక్త విన్యాసాలు చేస్తుంటామని, అందులో భాగంగానే ఈ నౌక టర్కీకి వెళ్లిందని వివరించారు.

  • Loading...

More Telugu News