: రుణమాఫీ సింగిల్ సెటిల్ మెంట్ కోసం టీ విపక్షాల వాయిదా తీర్మానం...సర్కారీ వ్యూహంపై ఉత్కంఠ


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. గత గురువారం నాటి సమావేశాల్లో భాగంగా రైతుల రుణమాఫీని ఒకే దఫాలో అమలు చేయాలని విపక్షాలన్నీ అధికార పక్షంపై దండెత్తాయి. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన అధికార పక్షం సభను కేవలం ఏడంటే ఏడు నిమిషాల్లో వాయిదా వేసి పలాయనం చిత్తగించిందన్న అపప్రథను మూటగట్టుకుంది. తాజాగా నేటి సమావేశాల్లోనూ రుణమాఫీ సింగిల్ సెటిల్ మెంట్ పైనే విపక్షాలన్నీ మూకుమ్మడిగా ప్రభుత్వంపై దండయాత్రకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఇప్పటికే విపక్షాలన్నీ ఈ అంశంపై వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కార్యాలయానికి అందించాయి. మరి విపక్షాలను అధికార పక్షం ఏ రీతిన అడ్డుకుంటుందోనన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News