: రజనీది ఉరిమే ఉత్సాహం!... సచిన్ ట్వీట్స్


ఇండియన్ సూపర్ లీగ్-2 సందర్భంగా క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మొన్న చెన్నైలో సందడి చేశారు. ఓపెన్ టాప్ జీపుపై అభిమానులకు అభివాదం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్న వీరిద్దరూ ఆ తర్వాత కార్యక్రమం ఆసాంతం పక్కపక్కనే గడిపారు. రజనీకాంత్ తో గడిపిన సమయాన్ని సచిన్ బాగా ఎంజాయ్ చేశారు. అంతేకాదండోయ్, క్రికెట్ దేవుడిగా క్రీడాభిమానులతో పిలిపించుకున్న సచిన్, రజనీకాంత్ ఉత్సాహానికి ఫిదా అయిపోయారు. ‘‘రజనీది ఉరిమే ఉత్సాహం. ఐఎస్ఎల్-2 ప్రారంభ కార్యక్రమంలో రజనీ ఉల్లాసంగా కనిపించారు. రజనీ ఉరిమే ఉత్సాహాన్ని చూస్తుంటే థ్రిల్లింగ్ గా అనిపించింది’’ అని సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకున్నారు.

  • Loading...

More Telugu News