: నాకు సినిమా జీవితం ప్రసాదించింది ఆయనే!: నటుడు అలీ


‘నాకు సినీరంగంలో ప్రవేశం కల్పించింది ఏడిద నాగేశ్వరరావు. భారతీ రాజా దర్శకత్వంలో రూపొందిన 'సీతాకోక చిలుక' చిత్రం నిర్మాత ఆయనే. ఆ చిత్రంలో బాలనటుడిగా నటించే అవకాశం ఇచ్చారు. ఎందరో గొప్ప నటులను సినీ పరిశ్రమకు అందించిన ఘనత ఆయనది. ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను తీసిన ఆయన మృతి చెందారన్న వార్త తెలిసి చాలా బాధపడ్డాను. తన చిత్రాలలో నటించిన నటీనటులు ఎలా ఉన్నారన్న విషయంపై ఆయన ఎప్పుడూ ఆరా తీసేవారు. ఆయన మృతి సినీరంగానికి తీరని లోటు’ అని హాస్య నటుడు అలీ అన్నారు.

  • Loading...

More Telugu News