: నేటి శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు


తిరుమల శ్రీవారి నేటి హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు. నేటి సాయంత్రం 6 గంటల వరకు స్వామి వారిని 63,634 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 5 గంటలు, నడకదారిన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. ఏడుకొండల వాడి దర్శనం కోసం సుమారు 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నట్లు సమాచారం. అక్టోబర్ 2 నుంచి వరుసగా మూడు రోజులపాటు సెలవు దినాలు వచ్చాయి. దీంతో శ్రీవారి దర్శనం నిమిత్తం తిరుమలకు భక్తులు పోటెత్తారు.

  • Loading...

More Telugu News