: బీహార్ లో మంచి నాయకుడిని ఎన్నుకోండి: ఫ్రెంచ్ మహిళ
బీహార్ లో ఎన్నికల ప్రచారం మార్మోగిపోతోంది. అధికార పార్టీపై ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలపై అధికార పార్టీ పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ఎలా అయినా సరే, ఓట్లు కొల్లగొట్టుకోవాలన్న లక్ష్యంతో ప్రచారాలు సాగిస్తున్నాయి. ఇదంతా బాగానే ఉంది, కానీ, భారత రాజకీయాలతో ప్రమేయం లేని, ఒక విదేశీ మహిళ బీహార్ లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు చైతన్యం కల్గిస్తోంది. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఈ మహిళ పేరు జెనీ పెరీ. బీహార్ లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సరైన నాయకుడ్ని ఎన్నుకోవాలంటూ ఆమె ప్రచారం చేస్తున్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరూ తమ ఓటును వేయాలని ఆమె ఇంటింటీకి వెళ్లి ప్రచారం చేస్తోంది. చాలా ఏళ్ల క్రితమే ఆమె ఇక్కడికి వచ్చారు. బీహార్ లోని గయలో సామాజిక కార్యకర్తగా పనిచేస్తూ, స్థానికంగా ఉండే పిల్లలకు ఆమె ఉచితంగా విద్యా బుద్ధులు నేర్పిస్తుంటుంది.