: కేటీఆర్ కు ‘ఆశా’ కార్యకర్తల సెగ
మంత్రి కేటీఆర్ కు ఆశా కార్యకర్తల సెగ తగిలింది. మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ లో కేటీఆర్ ప్రసంగాన్ని ఆశా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇక్కడ నిర్వహించిన ఒక బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతుండగా, తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆశా కార్యకర్తలు నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో కొంత గందరగోళ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. దీంతో అక్కడున్న అధికారులు వారిని సముదాయించి కూర్చోబెట్టారు.