: పనిపిల్లపై వేధింపుల కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ భార్య అరెస్టు
బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హుస్సేన్ భార్య న్రిట్టో హుస్సేన్ ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. తమ ఇంట్లో పని చేసిన బాలికపై వేధింపులకు, దాడికి పాల్పడడంతో వీరిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఆమె అరెస్టు జరిగింది. ఈ కేసుకు సంబంధించి గత కొంతకాలంగా భార్యాభర్తలు తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో న్రిట్టో హుస్సేన్ పుట్టింట్లో సోదాలు నిర్వహించి ఆమెను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. హుస్సేన్ తన భార్యతో కలిసి అత్తగారింట్లో తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో రంగంలోకి దిగామని పోలీసులు చెప్పారు. అయితే, ఆ ఇంట్లో షహదాత్ లేకపోవడంతో అతని భార్యను అరెస్టు చేశామన్నారు. షహదత్ ను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.