: ఇంతకాలం ఈ ఆనందాన్ని ఎలా మిస్సయ్యానో..!: ప్రకాష్ రాజ్


స్వతహాగా బైకులన్నా, ఘాట్ రోడ్లలో రైడింగ్ అన్నా ఇష్టపడే నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఊటీ కొండ రోడ్లపై బైక్ తో చక్కర్లు కొడుతూ ఆనందిస్తున్నాడు. చుట్టూ మంచుతెరలు కమ్ముకున్న ప్రాంతంలో కొండలపై బైక్ నడుపుతూ దిగిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఆయన "ఊటీలో బైకింగ్... ఆహ్... ఇంతకాలమూ ఎలా మిస్సయ్యానో..!" అని వ్యాఖ్యానించారు. ఊటీలోని స్థానిక చిన్నారులతో కలసి ఈ ఉదయం నీటిలో దిగి ఈత కొట్టిన ఆయన, తన చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయని, ప్రస్తుతానికి షూటింగును ఆపేసి ఆనందిస్తున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News