: కాస్త సమయం ఇవ్వండి... నేతాజీ రహస్యాలన్నీ చెబుతాం: బ్రిటన్


నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం, ఆయన మరణంపై రహస్యాలను వెల్లడించే ఫైళ్లను బహిర్గతం చేయాలా? వద్దా? అన్న విషయమై నిర్ణయం తీసుకునేందుకు తమకు మరికాస్త సమయం ఇవ్వాలని బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించినట్టు ఆయన బంధువులు ఆదివారం నాడు వెల్లడించారు. ఇటీవల బ్రిటన్ అధికారులను కలిసిన తాము 1945 తరువాతి ఫైళ్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసినట్టు వారు తెలిపారు. "నా సోదరి మాధురీ బోస్ యూకే ప్రభుత్వాన్ని సంప్రదించింది. బ్రిటన్ ప్రభుత్వం నుంచి స్పందన కూడా వచ్చింది. ఫైళ్ల బహిర్గతంపై వారు ఇంకాస్త సమయం కోరారు" అని నేతాజీ మునిమనవడు సూర్య కుమార్ బోస్ పీటీఐకి వెల్లడించారు. నెహ్రూ, పటేల్ లకు బోస్ ప్రమాదం కలిగిస్తాడన్న ఉద్దేశంతో ఆనాటి భారత ప్రభుత్వం అన్నట్టు తమకు తెలిసిందని, అందువల్లే ఈ ఫైళ్ల బహిర్గతం ప్రాధాన్యతను సంతరించుకుందని అన్నారు. భారత్ లో ఉన్న దస్త్రాలను బయట పెట్టాలని ప్రధాని మోదీపై ఒత్తిడి పెంచుతామని తెలిపారు. మొత్తం 13 వేలకు పైగా పేజీలు ఉన్నాయని తెలిపారు. 1945లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించారా? అనే విషయమై ఇప్పటివరకూ స్పష్టత రాలేదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News