: ఆ పనికి అదే సరైన శిక్ష: దాద్రి ఘటనపై సాధ్వీ ప్రాచి


ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, బీజేపీ నేతలను ఇబ్బందుల్లోకి నెట్టే వీహెచ్పీ నేత సాధ్వీ ప్రాచి మరోసారి అదేపని చేశారు. దాద్రిలో గోమాంసం తిన్నాడన్న ఆరోపణలపై జరిగిన దాడి, హత్యను ఆమె సమర్థించారు. హిందువులకు పవిత్రమైన గోవు మాసం తిన్నవారెవరికైనా ఇదే శిక్ష పడుతుందని అమె అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆమె "ఈ తరహా చర్యలు చేసిన వారు అటువంటి చర్యలను ఎదుర్కోక తప్పదు" అని అన్నారు. కాగా, ఈ కేసులో పోలీసులు ఇద్దరు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారిలో ఒకరు బీజేపీ స్థానిక నేత సంజయ్ రాణా కుమారుడు. స్థానిక మాంసం వ్యాపారి 50 సంవత్సరాల మహమ్మద్ ఇక్లాక్ ఇంటిపై దాదాపు 200 మంది దాడి చేసి, అతనిని తీవ్రంగా కొట్టి హత్య చేసిన సంగతి తెలిసిందే. యూపీలో ఆవు మాంసంపై నిషేధముండగా, ఇక్లాక్ ఆవు మాంసం తినడంతో పాటు విక్రయించారన్నది వీరి ప్రధాన ఆరోపణ.

  • Loading...

More Telugu News