: మొదలైన తెలుగు తమ్ముళ్ల సందడి!
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పార్టీ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం తెలుగు తమ్ముళ్ల సందడి మధ్య మొదలైంది. "మా తెలుగుతల్లికీ మల్లెపూదండ..." పాట అనంతరం మొదలైన కార్యక్రమంలో కేంద్ర కమిటీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. అందరితో ఒకేసారి ఆయన ప్రమాణ పత్రాన్ని చదివించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబునాయుడుకి ఒకవైపు తెలంగాణ కమిటీ అధ్యక్షుడు ఎల్ రమణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావు కూర్చున్నారు. కార్యక్రమానికి పెద్దఎత్తున తెలుగుదేశం అభిమానులు తరలిరావడంతో బంజారాహిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది.