: మారిన విశాఖ-సికింద్రాబాద్ దురంతో రైలు సమయం


విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య నడిచే 'దురంతో' ఎక్స్ ప్రెస్ రైలు సమయాన్ని మార్చినట్టు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు ఈ ఉదయం ఒక ప్రకటన వెలువరించారు. రోజూ రాత్రి 8:15 గంటలకు బయలుదేరే రైలు ఇకపై అరగంట ముందుగానే కదులుతుందని తెలిపారు. నిత్యమూ రాత్రి 7:45 గంటలకు రైలు బయలుదేరుతుందని వివరించారు. ఈ మార్పును ప్రయాణికులు గమనించాలని కోరారు. కాగా, ఇటీవల పలు ఎక్స్ ప్రెస్ రైళ్ల సమయాలను, నంబర్లను రైల్వే శాఖ అధికారులు మార్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News