: పిలిస్తే అపోలో వైద్యులు ఇంటికొస్తారు!


హాస్పిటల్ చైన్ నిర్వహిస్తున్న ప్రముఖ గ్రూప్ అపోలో హోమ్ కేర్ యూనిట్ ను ప్రారంభించింది. ఇకపై రోగులకు ఇంటి వద్దనే వైద్య సేవలు అందించనున్నామని సంస్థ ఫౌండర్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి వివరించారు. రూ. 50 కోట్లతో హోమ్ కేర్ యూనిట్ ను ప్రారంభించడం ద్వారా, ప్రస్తుతం ఢిల్లీ, హైదరాబాద్ లో రోగుల ఇళ్లలోనే సేవలందిస్తామని, త్వరలో అహ్మదాబాద్, బెంగళూరు, కోల్ కతా నగరాలకు విస్తరిస్తామని ప్రకటించారు. ఈ సేవల వల్ల హాస్పిటల్ లో రూ. 10 వేల వరకూ ఖర్చయ్యే చికిత్సలను ఇంటిలో రూ. 3,500కే పొందవచ్చని అన్నారు. తమ ఆసుపత్రులలో 80 శాతం వరకూ ఆక్యుపెన్సీ రేషియో ఉండగా, చాలా మందికి చికిత్సలు అందించలేకపోతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. మరో మూడు నెలల్లో రూ. 1,400 కోట్లతో నిర్మించిన 4 అత్యాధునిక ఆసుపత్రులు విశాఖపట్నం, ముంబై, బెంగళూరు, గువాహటి నగరాల్లో అందుబాటులోకి వస్తాయని ప్రతాప్ రెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News