: బీహార్ అమ్మాయిలకు బీజేపీ బంపరాఫర్... ఓటేస్తే స్కూటీ, ఉచిత పెట్రోల్


బీహార్ లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ హామీలపై హామీలు గుప్పిస్తోంది. తాజాగా, విద్యార్థినుల ఓట్లు లక్ష్యంగా బంపరాఫర్ ఇచ్చింది. విద్యలో ప్రతిభ చూపించే అమ్మాయిలకు స్కూటీలను, వాటికి ఉచిత పెట్రోలును సమకూరుస్తామని ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర నేత సుశీల్ కుమార్ మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు. స్కూటీలు పొందే ప్రతి ఒక్కరికీ రెండేళ్ల పాటు పెట్రోలు కూడా ఇస్తామని, పదిలో మంచి మార్కులతో పాసై, ఇంటర్ చదివే వారికి వీటిని అందిస్తామని ఆయన తెలిపారు. కాగా, స్కూటీలు ఇస్తామన్న హామీని ఆ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టగా, ఇప్పుడు పెట్రోలు కూడా ఇస్తామని ప్రకటించడం గమనార్హం.

  • Loading...

More Telugu News