: రెండంతస్తుల సూపర్ కంప్యూటర్ 'మేజిక్ క్యూబ్'
రెండంతస్తుల భవనమంత సూపర్ కంప్యూటర్ ను చైనా తయారు చేయనుంది. ఇందుకోసం 14 మిలియన్ల అమెరికా డాలర్లు వెచ్చించనున్నారు. భూమి భవిష్యత్తు, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు పరిశీలించేందుకు, బయోలాజికల్ సిస్టమ్ పర్యవేక్షణకు ఈ సూపర్ కంప్యూటర్ ను ఉపయోగిస్తారు. ఈ సూపర్ కంప్యూటర్ పేరును మేజిక్ క్యూబ్ గా నిర్ణయించారు. బీజింగ్ కు ఉత్తరప్రాంతంలోని జాన్ గువాన్ కన్ సాఫ్ట్ వేర్ పార్కులో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలోని పలు పరిశోధన ఇన్స్ స్టిట్యూట్ లు ఈ సూపర్ కంప్యూటర్ ను తయారు చేయనున్నాయి. ఈ కంప్యూటర్ సీఏఎస్ ఎర్త్ సిస్టమ్ మోడల్ 1.0 సాఫ్ట్ వేర్ ఆధారంగా పని చేయనుంది.