: ఇంగ్లిష్ ఛానెల్ ఈది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకెక్కిన తల్లీకూతుళ్లు


ఇంగ్లిష్ ఛానెల్ ను ఈదిన తొలి తల్లీకూతుర్లుగా రాజస్థాన్ కు చెందిన లీనా శర్మ, భక్తి శర్మ లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ లోకెక్కారు. తనకు ఎంతో ఇష్టమైన స్విమ్మింగ్ ను లీనా శర్మ, కుమార్తె భక్తికి కూడా నేర్పారు. దీంతో వీరిరువురూ పలు పోటీల్లో పాల్గొని పతకాలు సొంతం చేసుకునేవారు. అలా 2008లో తల్లి లీనా శర్మ, కుమార్తె భక్తి శర్మతో కలిసి ఇంగ్లండ్ నుంచి ఫ్రాన్స్ వరకు ఉన్న ఇంగ్లిష్ ఛానెల్ ఈదారు. దీంతో, వారిని ఇంగ్లిష్ ఛానెల్ ను ఈదిన తొలి తల్లీకూతుర్లుగా లిమ్కాబుక్ గుర్తించి, సత్కరించింది. ఈ విజయానికి కుటుంబ సభ్యుల ఆదరణే కారణమని తెలిపారు. నదిలో ఈదుతున్నప్పుడు బలమైన గాలులు వీచేవని, అయినా మనోధైర్యంతో ఇంగ్లిష్ ఛానెల్ ను ఈదామని తెలిపారు.

  • Loading...

More Telugu News