: స్వాగతం చెప్పేందుకు పావురాలకు తారాజువ్వలు కట్టి ఎగురవేసిన వైనం!
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వాగత కార్యక్రమాన్ని వినూత్నంగా చేయాలని తలంచి తప్పులో కాలేశారు. ఇక్కడ నిర్వహించే సభకు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వస్తుండగా ఆయనకు వినూత్నంగా స్వాగతం పలకాలనుకున్నారు. ఈ క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించిన కాంగ్రెస్ కార్యకర్తలు, రఘువీరా వచ్చిన సమయంలో స్వాగతం పలుకుతూ పెద్ద తారాజువ్వలకు రెండు పావురాలను కట్టి పైకి ఎగురవేశారు. దాంతో ఆ పావురాలు కొద్దిసేపటికే నేలకు ఒరిగాయి. ఇది తెలిసిన వన్యప్రాణి సంరక్షణ సంఘాల నేతలు మండిపడుతున్నారు.