: 120 ఏళ్ల నిబంధనను అడ్డుకున్న భారతీయుడు


ఇంగ్లండ్ లోని మారుమూల గ్రామం బోర్న్ విల్లేలో 120 ఏళ్ల నిబంధన నిలిచిపోనుంది. లండన్ లోని బర్మింగ్ హామ్ శివారుల్లో బోర్న్ విల్లే సంస్థలో పని చేసే సిబ్బంది కోసం బోర్న్ విల్లే గ్రామాన్ని 1890లో నిర్మించారు. ఈ గ్రామంలో ఇళ్లు, స్కూళ్లు, పార్కులు, షాపింగ్... ఇలా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అయితే గ్రామంలో మద్యం దుకాణం మాత్రం లేదు. 12 దశాబ్దాలుగా అక్కడ మద్యం అమ్మడం లేదు. ఇదో నిబంధనగా కొనసాగుతోంది. అక్కడ మద్యం అమ్మకాలు చేపట్టేందుకు భారత సంతతి వ్యక్తి కమల్ శర్మ ఏడేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై పోరాటంలో భాగంగా శర్మ న్యాయస్థానంలో పిటిషన్ కూడా వేశారు. ఆయన పిటిషన్ కు గ్రామంలోని 400 మంది మద్దతివ్వగా, 230 మంది వ్యతిరేకించారు. మెజారిటీ వాటా మద్యం దుకాణం ఏర్పాటును సమర్థించడంతో బర్మింగ్ హామ్ సిటీ కౌన్సిల్ లైసెన్సింగ్ సబ్ కమిటీ మద్యం అమ్మకాలకు అనుమతించింది. దీనికి కొన్ని షరతులు విధించింది. ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలని, కేవలం మద్యం దుకాణంలో మాత్రమే మద్యం తాగాలని స్పష్టం చేసింది. షాపులో సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించింది. దీంతో కమల్ శర్మ పోరాటం ఫలించింది. త్వరలోనే ఆయన మద్యం అమ్మకాలు ప్రారంభించనున్నారు.

  • Loading...

More Telugu News