: ఐదేళ్ల బాలికపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు : కోర్టుకు తెలిపిన పోలీసులు
ఐదేళ్ల ఢిల్లీ మైనర్ బాలికపై నిందితులు మనోజ్, ప్రదీప్ లు ఇద్దరూ అత్యాచారానికి పాల్పడినట్లు ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. విచారణ తర్వాత రెండో నిందితుడు ప్రదీప్ ను పోలీసులు ఈరోజు ఢిల్లీ కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. బాలికపై నిందితులిద్దరూ అత్యాచారం చేశారా? అని ఈ సందర్భంగా కోర్టు అడగిన ప్రశ్నకు అవునని సమాధానం చెప్పారు. అనంతరం న్యాయస్థానం నిందితుడిని నాలుగురోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది. అంతకుముందు ఈ వ్యవహారంలో 'ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్'(పీఓసీఎస్ఓ) చట్టం నిబంధనల కింద ఇద్దరు నిందితులపై పోలీసులు ఆరోపణలు నమోదు చేశారు.