: రుణమాఫీ హామీ వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు: గండ్ర
రైతు రుణాలను మాఫీ చేస్తామనే హామీతోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని... కానీ ఇప్పుడు రుణమాఫీపై అలసత్వం ప్రదర్శిస్తున్నారని టీకాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేయిస్తున్న హత్యలే అని చెప్పారు. రుణమాఫీని ఒకేసారి చేయడమే ఈ సమస్యకు పరిష్కారమని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్నే కాకుండా, రూ. 16,500 కోట్ల మిగులు బడ్జెట్ ను కూడా కాంగ్రెస్ పార్టీనే ఇచ్చిందని చెప్పారు. పంతాలు, పట్టింపులను ముఖ్యమంత్రి వదిలివేయాలని... వెంటనే కరవు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.