: చంద్రబాబుకు సింగపూర్ లో హోటల్ ఉందని దేశమంతటికీ తెలుసు: పార్థసారథి
ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిసారీ సింగపూర్ వెళుతుండటం, అక్కడి ప్రభుత్వంతో సంబంధాలు నెరుపుతుండటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నేత పార్థసారథి మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిని పెంచిపోషిస్తోందని ఆరోపించారు. సింగపూర్ లో బాబుకు హోటల్ ఉందని దేశమంతా తెలుసునని, ఈ విషయంపై ప్రముఖ దినపత్రిక సండే గార్డియన్ కథనం ప్రచురించిందని అన్నారు. బ్లాక్ మనీకి సింగపూర్ హబ్ గా మారిందని పత్రిక కథనం పేర్కొందన్నారు. అసలు సీఎంకు సింగపూర్ పై అంత ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. బాబుకు దమ్ముంటే సింగపూర్ లోని ఆయన ఆస్తులు, లావాదేవీలపై సీబీఐతో లేదా ఎస్ఎఫ్ఐఓతో విచారణకు ముందుకురావాలని సవాల్ విసిరారు.