: హాస్టళ్లకు సన్నబియ్యం ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే: ఎమ్మెల్యే చల్లా
తెలంగాణ రాష్ట్రంలో హాస్టళ్లకు సన్నబియ్యం ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆ పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే మార్చి నుంచి వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ తప్పకుండా సరఫరా అవుతుందని చల్లా భరోసా ఇచ్చారు. వరంగల్ లో ఈ మేరకు మీడియాతో చల్లా మాట్లాడుతూ, రైతు సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.