: ఇప్పుడు కాదు, మేలో రాజధానికి వస్తామని చెప్పాం: ఏపీ ఉద్యోగుల సంఘం


ఏపీ సచివాలయ ఉద్యోగులను హైదరాబాద్ నుంచి రాజధానికి తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఉద్యోగులు విజయవాడలో సీఎం చంద్రబాబును కలసి చర్చించారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నందున ఇప్పటికిప్పుడే విజయవాడకు రాలేమని చెప్పామని ఏపీ ఉద్యోగుల సంఘాల నేత మురళీకృష్ణ తెలిపారు. మే, జూన్ నెలల్లో రాజధానికి వచ్చేందుకు ఉద్యోగులు సిద్ధమని చెప్పారు. 2017 జూన్ నాటికి తిరిగి వచ్చేవారికి ఏపీ స్థానికత ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు వెసులుబాటు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులందరికీ అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశామని మురళీ కృష్ణ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News