: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కన్నా ప్రాజెక్టులే ముఖ్యం: వెంకయ్యనాయుడు
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ రూ.3.80 కోట్లతో చేపట్టనున్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి వెంకయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కన్నా ప్రాజెక్టులే ముఖ్యమని పేర్కొన్నారు. తొలి ప్రాధాన్యం వాటికేనని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటికి 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే కొత్త ప్రాజెక్టులు రాక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. అయినప్పటికీ హోదా కోసం పోరాడదామని, ఈ అంశం నీతీ అయోగ్ పరిశీలనలో ఉందని చెప్పారు. దేశంలో ఆర్థిక స్వావలంబన సృష్టించి సంపదను ప్రజలకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.