: బోల్తాపడ్డ స్కూలు బస్సు... 40 మంది విద్యార్థులకు గాయాలు


స్కూలు బస్సు బోల్తాపడిన ఘటనలో 40 మంది చిన్నారులు గాయపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం కాట్పేరి వద్ద చోటు చేసుకుంది. బోల్తా పడ్డ బస్సు రాయలసీమ స్కూలుకు చెందినది. ప్రమాదం జరిగిన వెంటనే, అక్కడ ఉన్న స్థానికులు స్పందించారు. బస్సులో నుంచి విద్యార్థులను బయటకు తీశారు. అనంతరం చిన్నారుల్లో కొందరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరికొంత మందిని మదనపల్లిలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన చిన్నారుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరికి మెరుగైన చికిత్స అందించేందుకు తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది విద్యార్థులు ఉన్నారు. ఎదురుగా వస్తున్న ఓ స్కూటర్ ను తప్పించబోయే ప్రయత్నంలోనే, ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News