: మూడో రోజూ అద్భుతం ఆవిష్కృతం... ఆదిత్యుడి పాదాలను తాకిన భానుడి కిరణాలు
వరుసగా మూడో రోజు కూడా అద్భుతం ఆవిష్కృతమైంది. ఆదిత్యుడి పాద పద్మాలను భానుడి కిరణాలు ముద్దాడాయి. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలోని శ్రీ సూర్యనారాయణుడి ఆలయంలో మూల విరాట్ ను సూర్యుడి కిరణాలు స్పృశించాయి. వరుసగా మూడో రోజు కూడా ఆవిష్కృతమైన ఈ అద్బుతాన్ని కనులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నిన్న, మొన్న కూడా సూర్యుడి కిరణాలు ఆదిత్యుడి పాదాలను తాకిన సంగతి తెలిసిందే. నేడు కూడా ఆ అద్భుతం జరిగితీరుతుందని గట్టిగా విశ్వసించిన భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చారు. నేటి ఉదయం 13 నిమిషాల పాటు సూర్యుడి కిరణాలు ఆదిత్యుడి పాద పద్మాలను తాకాయి. అయితే ఆలయ అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. మూడో రోజు ఆవిష్కృతమైన అద్భుతాన్ని కేవలం వీఐపీలు మాత్రమే దర్శించుకోగలిగారు. సామాన్య భక్తులకు ఆ భాగ్యం దక్కలేదు.